అమెరికా తర్వాత మనమే..

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొదటి దశను మించి విజృంభిస్తోంది. నిత్యం లక్షలకు పైగా కరోనా కేసులు వేలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో 1,68,912 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు భారత్‍లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,35,27,717కి చేరింది. ఫలితంగా కరోనా కల్లోలంతో విలవిలలాడుతున్న దేశాల జాబితాలో బ్రెజిల్‍ను దాటేసిన అమెరికా తర్వాత రెండో స్థానంలో నిలిచింది. అమెరికాలో ఇప్పటి వరకు 3,19,18,591 కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్‍లో ఆ సంఖ్య కోటీ 35 లక్షల మార్కును దాటగా బ్రెజిల్ తరవాత స్థానంలో ఉంది. బ్రెజిల్‍లో మొత్తం ఇప్పటి వరకు 1,34,82,543 కేసులు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలో 5,75,829, బ్రెజిల్‍లో 3,53,293, మెక్సికోలో 2,09212 మంది మరణించారు. కేసుల సంఖ్యపరంగా భారత్ రెండో స్థానంలో ఉండగా, మృతుల సంఖ్య (1.70 లక్షలు) విషయంలో మాత్రం నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం కేసులతో పాటే మరణాల సంఖ్యలో కూడా వృద్ధి కనిపిస్తుండటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది.