యూపీ సీఎంకు కరోనా పాజిటివ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా బారిన పడ్డారు. తనకు పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నిర్ధారణ అయినట్లు యోగి వెల్లడించారు. ఇప్పటికే ఆయన హోం ఐసోలేషన్‍లో ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి కరోనా సోకడంతో ఆదిత్యనాథ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. రోజు వారీ కార్యక్రమాలను వర్చువల్‍గా ఇంటి నుంచే నిర్వహిస్తున్నారు. తనను ఇటీవల కలిసిన వారందరూ కొవిడ్ పరీక్షలు చేసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ప్రజలందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు