మొబైల్ ఫోన్ తో కరోనా టెస్టు
స్మార్ట్ఫోన్ తో కరోనా పరీక్ష నిర్వహించే నూతన విధానాన్ని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు ఆవిష్కరించారు. రషీద్ షీర్, అనురూప్ గంగూలీ అనే భారతీయ అమెరికన్ ప్రొఫెసర్లలో కూడిన పరిశోధకుల బృందం 3డీ ప్రింటెడ్ కాట్రిడ్జ్ను తయారు చేసింది. దానిలో రెండు గదులు ఉంటాయి. దీనిని స్మార్ట్ఫోన్ కు అనుసంధానిస్తారు. కాట్రిడ్జ్లోని ఒక గదిలో రోగి నుంచి సేకరించిన శాంపిల్, మరోదాంట్లోకి వీరు తయారుచేసిన కెమికల్ సిరెంజిల ద్వారా పంపి 65 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు వేడి చేస్తారు. వెంటనే ఆవి రెండూ కలిసిపోయి శాంపిల్లో కొవిడ్-19 జెనటిక్ పదార్థం ఉందోలేదో ఫోన్లో వివరాలు తెలుస్తాయని పరిశోధన పత్రం రాసిన అనురూప్ గంగూలీ తెలిపారు. కేవలం 30 నిమిషాల్లో ఈ టెస్టు ఫలితం వెల్లడవుతుంది.






