ఈ టీకా తీసుకున్నవారు.. బ్రిటన్ రావడానికి అనుమతి

అంతర్జాతీయ ప్రయాణికుల కోసం గుర్తించిన కొవిడ్ టీకాల జాబితాలో భారత్‌కు చెందిన కొవాగ్జిన్‌కు చేర్చుతున్నట్టు బ్రిటన్ ప్రకటించింది. నవంబర్ 22 నుంచి ఈ టీకా తీసుకున్నవారు బ్రిటన్‌కు చేరుకున్న తరువాత ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ను ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) అత్యవసర వినియోగ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. బ్రిటన్ ప్రభుత్వం ఇదివరకే కొవిషీల్డ్‌ను గుర్తించింది. నవంబర్ 22 నుంచి కొవాగ్జిన్‌తో సహా డబ్ల్యూహెచ్‌వో అత్యవసర వినియోగానికి గుర్తించిన టీకాలు వేసుకుని భారతీయులు ఎవరైనా ఇక్కడికి చేరుకున్నాక ఐసొలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎలిస్ తెలిపారు. నవంబర్ 22 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలు లోకి వస్తాయి.