యు.కె.లో అలెర్జీ ప్రతిచర్యలని ఎదుర్కొంటున్న ఫైజర్- బయోఎంటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్

బ్రిటిష్ ప్రభుత్వం నవంబర్ నెల చివరలో ఫైజర్ / బయోఎంటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ వాడటానికి అనుమతి ఇచ్చారు మరియు అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ వారం చివరిలో ఫైజర్ / బయోఎంటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు కొంతమంది అధికారులు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను మంగళవారం 8th డిసెంబర్ 2020 న మొదటిసారి పంపిణీ చేయగా యు.కె.లో వేలాది మంది ప్రజలు ఫైజర్ / బయోఎంటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ ను తీసుకున్నారు. తీవ్రమైన అలెర్జీ ఉన్న ఇద్దరు బ్రిటీష్ ప్రజలు ఫైజర్ / బయోఎంటెక్ యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్‌కు అలెర్జీ ప్రతిచర్యలు ఎదురుకుంటున్నారు. ఇది అలెర్జీ ఉన్నవారికి సురక్షితమేనా అనే ప్రశ్నలను లేవనెత్తుతుంది. బ్రిటిష్ ఆరోగ్య అధికారులు తీవ్రమైన అలెర్జీ ఉన్నవారికి ఫైజర్ / బయోఎంటెక్ యొక్క కోవిడ్-19 వ్యాక్సిన్‌ను నివారించాలని సూచించారు.
అలెర్జీ ప్రతిచర్యలను ప్రేరేపించిన విషయం వెంటనే స్పష్టంగా తెలియకపోవడం మరింత భయాందోళన కలిగిస్తోంది. ఫైజర్ / బయోఎంటెక్ వ్యాక్సిన్‌లో సంరక్షణకారులు లేదా జంతు ఉత్పత్తులు లేవు కాబట్టి ఇతర రకాల టీకాలతో ప్రతిచర్యలకు ఆస్కారం లేదు అని తెలియజేశారు.
అయితే అమెరికా విచారణలో అలెర్జీ ప్రతిచర్యలు ఒక ముఖ్యమైన సమస్య కాదు అని 20,000 మందికి పైగా ప్రజలు రెండు మోతాదుల వ్యాక్సిన్‌ను అందుకున్నారు మరియు వారి ప్రతిచర్యలు సానుకూలంగానే ఉన్నాయి అని తెలిపారు. తీవ్రమైన అలెర్జీ ఉన్నవారిలో ప్రమాదకరమైన ప్రతిచర్యలను ప్రేరేపించే వ్యాక్సిన్‌ను అమెరికన్ ప్రజలు ఉపయోగించడానికి ఆమోదించలేమని హ్యూస్టన్‌లోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌లోని శిశువైద్యులు మరియు నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ అన్నారు.