అమెరికాకు కొత్త రకం కలవరం!

కరోనా వైరస్ వ్యాప్తితో ఇప్పటికే తీవ్ర గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికాను కొత్త రకాలు మరింత కలవరానికి గురిచేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న యూకే వేరియంట్ కేసులు అక్కడ క్రమంగా పెరుగుతున్నాయి. దీనిపై ఆ దేశ అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోని ఫౌచీ ఆందోళన వ్యక్తం చేశారు. ఏప్రిల్ నాటికి అమెరికాలో యూకే వేరియంట్ ప్రబలంగా మారే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, దక్షిణాఫ్రికా వేరియంట్‍పై మాత్రం ఇంకా సృష్టత లేదని తెలిపారు. అమెరికాలో యూకే రకం వైరస్ ఇప్పటి వరకు 28 రాష్ట్రాలకు విస్తరించింది. మొత్తం 315 కేసులు వెలుగులోకి వచ్చాయి.