డొనాల్డ్ ట్రంప్ కు కరోనా నెగెటివ్
కరోనా మహమ్మారి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా కోలుకున్నారు. వరుస పరీక్షలో ఆయనకు కొవిడ్ నెగెటివ్ వచ్చిందని శ్వేతసౌదం వైద్యుడు సీన్ కాన్లే వెల్లడించారు. వరుసగా అయిదురోజుల పాటు ఆయనకు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తూ వచ్చారు వైట్‌హౌస్ ఫిజీషియన్లు. తాజాగా నిర్వహించిన టెస్టుల్లోనూ ట్రంప్‌కు నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. యాంటీజెన్ కార్డ్ ద్వారా అధ్యక్షుడికి కరోనా వైరస్ నిర్థారణ పరీక్షలను నిర్వహించినట్లు చెప్పారు.
అలాగే యాంటీజెన్ ద్వారా ఆయనకు పలుమార్లు కరోనా నిర్ధారణ పరీక్షలను చేపట్టినట్లు కాన్లే చెప్పారు. అలాగే వైరస్ లోడ్, ఆర్ఎన్ఏ, పీసీఆర్ విధానాలు వంటి అందుబాటులో ఉన్న అన్ని లాబొరేటరీ డేటాల ఆధారంగా డొనాల్డ్ ట్రంప్‌నకు కరోనా నెగెటివ్ వచ్చిందనే విషయాన్ని నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ట్రంప్‌నకు వైద్య పరీక్షలను చేశామని, ఆయనలో సీజనల్‌గా సంభవించే ఏ ఇతర ఫ్లూ లక్షణాలు గానీ, వ్యాధులు గానీ కనిపించలేదని పేర్కొన్నారు.






