తెలంగాణలో కొత్తగా 1,717 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,717 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,12,063కు చేరింది. తాజాగా 2,103 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 1,85,128కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో ఐదుగురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,222 మంది మృత్యువాత పడ్డారు. అలాగే పదిలక్షల జనాభాలో 95,299 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 35,47,051 మందికి పరీక్షలు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.






