మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఇంట్లోనే విశాంత్రి తీసుకుంటున్నా అని సోమిరెడ్డి ట్విటర్‌లో తెలిపారు. తనకు ఇటీవల కలిసిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు.