ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కరోనా పాజిటివ్

రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కరోనా పాజిటివ్‍గా తేలింది. ఈ మేరకు ఆర్‍ఎస్‍ఎస్ ట్వీట్ చేసింది. సాధారణ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా, పాజిటివ్‍గా తేలినట్లు పేర్కొంది. దీంతో ఆయన నాగ్‍పూర్‍లోని కింగ్స్వే హాస్పిటల్‍లో చేరారు. ఆయనకు సాధారణ పరీక్షలు చేశారని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. మార్చి 7న ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోవడం గమనార్హం. ఆయన ఇంకా రెండో డోసు తీసుకోలేదని తెలిసింది.