ఫైజర్-బయోఎంటెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ కు భారత్ లో అనుమతి దొరుకుతుందా?
యూ.కే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కరోనా వైరస్ వ్యాక్సిన్ ఫైజర్-బయోఎంటెక్ సంస్ధ తయారు చేసిన సంగతి తెలిసిందే అయితే గత నెలలో ఫైజర్-బయోఎంటెక్ సంస్ధ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు(F.D.A) కి తమ సంస్థ తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ అమెరికా లోను అత్యవసర వినియోగానికి అనుమతి కోరుతూ దరఖాస్తు దాఖలు చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఫైజర్-బయోఎంటెక్ సంస్ధ తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతించాలని భారత ప్రభుత్వంని కోరింది. డిసెంబర్ 4న 2020 శుక్రవారం నాడు ఫైజర్-బయోఎంటెక్ సంస్ధ డీసీజీఐ కు దరఖాస్తు చేసినట్లు సమాచారం. అయితే ఫైజర్-బయోఎంటెక్ సంస్ధ ప్రత్యేక మినహాయింపుల ద్వారా భారత దేశం లో తమ కరోనా వైరస్ వ్యాక్సిన్ ను ఎలాంటి క్లినికల్ ట్రయల్స్ లేకుండానే నేరుగా వ్యాక్సిన్ దిగుమతి చేసుకుని వినియోగించటానికి అనుమతించాలని కోరింది. అయితే డిసెంబర్ 10 2020 న అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(F.D.A) కూడా ఫైజర్-బయోఎంటెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగంపై కీలక నిర్ణయం తీసుకోనుంది అని సమాచారం.
ఫైజర్-బయోఎంటెక్ సంస్ధ వ్యాక్సిన్ సమర్ధత 95 శాతం వరకూ ఉన్నట్లు ప్రకటించింది. అయితే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ ను నిల్వ చేయాల్సి ఉండటం, భారత వాతావరణానికి ఇది సరిపడుతుందా లేదా అనే అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు కానీ ఫైజర్-బయోఎంటెక్ సంస్ధ మాత్రం తమ కరోనా వైరస్ వ్యాక్సిన్ పై గట్టి నమ్మకంతో ఉన్నారు.






