అమెరికా మార్కెట్ లోకి కొవ్యాక్సిన్

అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ ఆక్యుజెన్ మెక్సికోలో కూడా కొవ్యాక్సిన్‌ను వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో మొత్తం ఉత్తర అమెరికాలో కొవ్యాక్సిన్‌ను మార్కెట్ చేసే హక్కులు ఆక్యుజెన్‌కు లభించినట్లవుతుంది. అమెరికాలో కొవ్యాక్సిన్‌పై పరీక్షలు నిర్వహించి, వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావడానికి గతంలో ఆక్యుజెన్, భారత్ బయోటెక్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో సవరణలు చేసి మెక్సికో హక్కులను కూడా ఆక్యుజెన్‌కు అప్పగించారు. ఇప్పటికే పెద్దలు కొవ్యాక్సిన్‌ను తీసుకునేందుకు మెక్సికో ఆరోగ్య నియమంత్రణ సంస్థ అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది. 2-18 ఏళ్ల వయసు ఉన్న వారు కూడా వినియోగించేందుకు వీలుగా అనుమతి కోరారు. ఆక్యుజెన్ ఇంక్ సీఈవో శంకర్ ముసునూరి మాట్లాడుతూ మెక్సికోలో కూడా కొవ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి హక్కులు లభించడం సంతోషంగా ఉందని తెలిపారు.