ఐసీఎంఆర్ కీలక ప్రకటన.. ఫోర్త్‌వేవ్ చాన్స్ లేదు!

దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఫోర్త్‌వేవ్ వస్తుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. దేశంలో ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశాలు లేవని ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ సమిరన్ పాండా వెల్లడిరచారు. ప్రస్తుతం దేశంలో రోజువారి కేసులు 3 వేలకు పైబడి నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు పాక్షికంగా అమలు చేస్తున్నారు. మాస్క్ తప్పనిసరి చేశారు. అయితే ఫోర్త్‌వేవ్ చాన్స్ లేదని ఐసీఎంఆర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్పష్టం చేశారు. జిల్లా స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తిని పరిశీలిస్తూ, దేశంలో ఫోర్త్ వేవ్ వచ్చే పరిస్థితి లేదని స్పష్టమవుతోందన్నారు. కొన్ని ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తి హెచ్చుతగ్గుదల కనిపిస్తోంది. దీన్ని చూసి ఫోర్త్‌వేవ్ వస్తుందని అంచనా వేయడం సమజసం కాదని పాండా పేర్కొన్నారు.