ఆస్ట్రేలియాలో వెలుగులోకి వచ్చిన మరో వైరస్

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వంశంలో మరో తాజా వైరస్ వెలుగుచూసింది. అయితే స్క్రీనింగ్ పరీక్షలకు ఇది అంత సులభంగా లేదు. దక్షిణాఫ్రికా నుంచి ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు ఇటీవల వచ్చిన ఓ వ్యక్తిలో దీన్ని కనుగొన్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన ఆరోగ్యాధికారి పీటర్ ఐకెన్ వెల్లడించారు. అసలు కరోనా వైరస్‌లోని సగం జన్యు వైవిధ్యాలు ఇందులో ఉన్నట్టు తెలిపారు. సదరు ప్రయాణికుడికి కొవిడ్ పరీక్ష నిర్వహించగా పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో అతడి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా కొత్త వైరస్ జాడ కనిపించింది. కొత్త కనిపించిన వైరస్ ఒమిక్రాన్ మాదిరే ఉంది. రెండింటి మధ్య చాలా పోలికలు ఉన్నాయి. అందుకే వీటిని ఒకే వంశానికి చెందిన వైరస్‌లుగా పరిగణిస్తున్నాం అని పీటర్ పేర్కొన్నారు.