అమెరికాలో కోటి మందికిపైగా.. చిన్నారులకు

కరోనా మొదలైనప్పటి నుంచి అమెరికాలో కోటిమందికి పైగా చిన్నారులు వైరస్ బారిన పడ్డారని తాజా నివేదికలు వెల్లడించాయి. అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు కోటి ముప్పై లక్షలు (13 మిలియన్లు) మంది పిల్లలు కొవిడ్ బారినపడ్డారని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఎఎపి) చిల్డ్రన్స్ హాస్పిటల్ నివేదిక వెల్లడిరచింది. ఇక ఈ కేసుల్లో నాలుగు వారాల క్రితం 14,900 కరోనా కేసులు నమోదయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆ దేశంలో 50 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతో ఆ దేశంలో 19 శాతం చిన్నారుల కోవిడ్ కేసులే నమోదయ్యాయని తెలిపింది.