కరోనా బారిన పడిన మరో సీఎం

మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా టెస్ట్ చేయించుకున్నారు. దీంతో పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. ఈ నేపథ్యస్త్రంలో తాను ఐసొలేషన్‌లో ఉంటున్నానని సీఎం సంగ్మా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా లక్షణాలను గమనించి పరీక్ష చేయించుకోవాలని, సురక్షితంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.