మానుకోట ఎమ్మెల్యేకు కరోనా
కోవిడ్ 19 పరీక్షలు చేయించుకున్న తనకు కరోనా పాజిటీవ్‌గా ఫలితం వచ్చిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వివిధ పనులపై గత రెండు మూడు రోజులుగా తనను కలిసిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కరోనా పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నియోజక వర్గంలోని ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఏ సమస్య ఉత్పన్నమైనా దాని పరిష్కారం కోసం 99098 03555 లేదా 99839 03555 ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని ఆయన తెలిపారు.






