జగిత్యాల ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. హైదరాబాద్‌లో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లిన ఎమ్మెల్యే ఉదయం కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో ఎమ్మెల్యే సంజయ్‌కి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఎమ్మెల్యే హైదరాబాద్‌లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, ఐదు రోజుల నుంచి తనను వివిధ పనుల నిమిత్తం కలిసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తనను కలిసిన వారు ఐసోలేషన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.






