దేశంలో కొత్తగా 18,855 కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో 18,855 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్త కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,20,048కు చేరింది. తాజాగా 20,746 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 1,03,94,352 కోలుకున్నట్లు తెలిపింది. మరో 163 మంది మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1,54,010కు చేరింది. ప్రస్తుతం దేశంలో 1,71,686 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉండగా గురువారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 7,42,306 శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది. ఇప్పటి వరకు 19,50,81,079 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.