దేశంలో రికార్డు స్థాయిలో కేసులు.. ఒక రోజులో

దేశంలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,60,960 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 3,293 మంది మృత్యువాతపడ్డారు. 24 గంటల్లో 2,61,162 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,97,267కి చేరింది. ఇప్పటి వరకు 1,48,17,371 మంది వైరస్ బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 29,78,709 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనాతో 2,01,187 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించింది. దేశంలో రికవరీ రేటు 82.33 శాతంగా ఉంది. కేంద్ర లెక్కల ప్రకారం దేశ జనాభాలో ఇప్పటి వరకు 14.78 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. లక్షకు పైగా కరోనా మరణాలు సంభవించిన దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానంలో ఉన్నది. ఇప్పటివరకు యూకే, ఇటలీ, రష్యా, ఫ్రాన్స్ లో లక్షకు పైగా మరణాలు నమోదయ్యాయి.