భారత్ లో కొనసాగుతున్న మృత్యు ఘోష.. ఒక్క రోజులో

భారత్ కరోనా వైరస్‍తో పోరాడుతోంది. ఇప్పటికే మూడు లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 19,28,127 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,22,315 మందికి కరోనా పాజిటివ్‍గా తేలింది. 24 గంటల వ్యవధిలో 4,454 మరణాలు సంభవించాయి. మొత్తం ఇప్పటి వరకు 2,67,52,447 మంది కరోనా బారిన పడ్డారు. 3,03,720 మంది మరణించారు. తాజాగా 3,02,544 మంది కోలుకోగా మొత్తం 2,37,28,011 మంది ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం దేశంలో 27,20,716 క్రియా శీల•• కేసులున్నాయి. ఏప్రిల్ 15 తర్వాత ఇప్పుడే తక్కువ కేసులు నమోదు అయ్యాయి. టీకా డ్రైవ్‍లో ఇప్పటి వరకు 19,60,51,962 డోసులు వేసినట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.