దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 11,73,219 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,45,384 మందికి పాజిటివ్‍గా తేలింది. తాజాగా 794 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,32,05,926 చేరగా.. 1,68,436 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 10,46,631 మంది కొవిడ్‍తో బాధపడుతున్నారు. మొత్తం కేసుల్లో క్రియాశీల కేసుల వాటా 8 శాతానికి చేరువైంది. మరోవైపు రికవరీ రేటు 90.8 శాతానికి పడిపోయింది. అయితే, నిన్న ఒక్కరోజే 77,567 మంది కోలుకోవడం సానుకూల పరిణామం. ప్రస్తుతం వైరస్‍ను జయించిన వారి సంఖ్య కోటీ 20 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకు దేశంలో 9.80,75,160 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది.