దేశంలో స్వల్పంగా పెరిగిన.. కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు వరుసగా రెండో రోజు స్వలంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 21,59,873 మందికి కరోనా పరీక్షలు చేయగా 1,34,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 2,887 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర కటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్‍ను విడుదల చేసింది. కొత్తగా 2,11,499 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 2,63,90,584 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనాతో 3,37,989 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 17,13,413 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్‍లో భాగంగా ఇప్పటి వరకు 22,10,43,693 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.