మళ్లీ 11వేల పైన కొత్త కేసులు

గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 11,610 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,09,37,320కు పెరిగింది. తాజాగా 11,833 మంది కోలుకోగా ఇప్పటి వరకు 1,06,44,858 మంది కోలుకున్నారు. మరో వంద మంది మృత్యువాతపడగా.. మృతుల సంఖ్య 1,55,913కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,36,549 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. రికవరీ రేటు 97.33 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 2 శాతానికి దిగవనే కొనసాగుతుండటం ఊరటనిస్తోంది.