దేశంలో కరోనా ఉధృతి… రికార్డు స్థాయిలో కేసులు

దేశంలో కరోనా వైరస్ రెండో దశ ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. గత వారం రోజులుగా మూడు లక్షలకు పైగా మంది కరోనా బారినపడుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 17.68 లక్షల టెస్టులు చేయగా 3,79,257 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,83,76,524కు చేరింది. కొత్తగా 2,69,507 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 1,50,86,878 చేరింది. గడిచిన 24 గంటల్లో 3,645 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దాని బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,04,832కు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీలక కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం 30,84,814 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15,00,20,648 మంది కరోనా టీకా పంపిణీ చేశామని తెలిపింది.