24 గంటల్లో 43 లక్షలకు పైగా..

దేశంలో కరోనా వైరస్‍ను కట్టడి చేసే వ్యాక్సినేషన్ పక్రియను కేంద్రం వేగవంతం చేసింది. 24 గంటల వ్యవధిలో 43 లక్షల మందికి పైగా టీకాలు అందించింది. దేశంలో టీకా పంపిణీ ప్రారంభమైన తర్వాత ఒక రోజులో ఇంత భారీ స్థాయిలో వ్యాక్సిన్లు వేయడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 5న మొత్తం 43,00,966 మంది టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో తొలి డొసు తీసుకున్నవారు 39 లక్షలయితే, రెండో డోసు తీసుకున్నవారు 4 లక్షల మంది ఉన్నారు. దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకాలు తీసుకున్నవారి సంఖ్య 8.3 కోట్లు దాటినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.