దేశంలో కరోనా విజృంభణ…
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 50,210 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 704 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 83,64,086 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రత పెరుగుతున్నా డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉండటం కొంత ఉపశమనం కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 55,331 మంది డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 5,33,787 యాక్టివ్ కేసులున్నాయి. ఇక మొత్తం ఇప్పటి వరకు 76,11,809 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.






