24 గంటల్లో 11,649 కొత్త కేసులు…

దేశంలో కరోనా వ్యాప్తి నియంత్రణలోనే ఉంది. అయితే రోజువారీ కేసుల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 4,86,122 మంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,649 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇప్పటి వరకు 1,09,16,589 మంది వైరస్ బారిన పడినట్లైంది. 90 మంది ఈ మహమ్మారి కారణంగా మృత్యు ఒడికి చేరుకున్నారు. మొత్తంగా 1,55,732 మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 1,39,637 క్రియాశీల కేసులుండగా. ఆ రేటు 1.28 శాతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1.06 కోట్ల మంది కొవిడ్ నుంచి కోలుకోగా ఆ రేటు 97.29 శాతంగా ఉంది. మరోవైపు జనవరి 16న ప్రారంభమైన కరోనా టీకా కార్యక్రమం కిందట ఇప్పటి వరకు 82,85,295 మందికి టీకాలు అందించినట్లు కేంద్రం వెల్లడించింది.