దేశంలో 24 గంటల్లో 11,427 కరోనా కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,427 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,07,57,610కి పెరిగింది. మరో 11,858 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,04,34,983 మంది కోలుకున్నారని పేర్కొంది. కొత్తగా 118 మంది మృతి చెందగా, మరణాల సంఖ్య 1,54,392కు చేరిందని మంత్రిత్వశాఖ తెలిపింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 97 శాతానికి చేరిందని, మరణాల రేటు 1.44 వా శాతంగా ఉందని పేర్కొంది. వరుసగా దేశంలో 13వ రోజు పాజిటివ్ కేసులు రెండు లక్షల కన్నా తక్కువగా ఉన్నాయని చెప్పింది. ప్రస్తుతం దేశంలో 1,68,235 యాక్టివ్ కేసులున్నాయని, కాసేలోడ్‌లో 1.56 శాతమేనని చెప్పింది. నిన్న ఒకే రోజు 5,04,263 నమూనాలను పరిశీలించగా, ఇప్పటి వరకు 19,70,92,635 పరిశీలించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తెలిపింది.