ఫిబ్రవరిలోనే వ్యాక్సిన్ …
కొవిడ్-19 వ్యాక్సిన్‌ను భారత్ బయోటెక్ సంస్థ వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపే ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త రజని కాంత్ తెలిపారు. భారత ప్రభుత్వ సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ కోవిడ్ కోసం కొవాగ్జిన్ వ్యాక్సిన్ రూపొందిస్తున్నది. కొవాగ్జిన్ తుది దశ ట్రయల్స్ ఈ నెలలోనే ప్రారంభం అయ్యాయని, అయితే ఇప్పటి వరకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ ప్రకారం వ్యాక్సిన్ సురక్షితంగా, ప్రభావంతంగా ఉన్నట్లు తేలిందని రజని కాంత్ తెలిపారు. భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో కొవాగ్జిన్ కోసం ట్రయల్స్ జరుగుతున్నాయి. తొలుతు ఈ వ్యాక్సిన్‌ను వచ్చే ఏడాది రెండవ క్వార్టర్లో విడుదల చేయాలని భావించారు. కానీ ఫిబ్రవరి లేదా మార్చి ఆరంభంలోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు రజని కాంత్ తెలిపారు. దీనిపై భారత్ బయోటెక్ సంస్థ ఇంకా స్పందించలేదు. ఐసీఎంఆర్ రీసర్చ్ మేనేజ్మెంట్లో రజని కాంత్ హెడ్‌గా ఉన్నారు.






