టీకా కోసం 9 నెలల వ్యవధి ఉంటే బాగుంటుంది : ప్రభుత్వ ప్యానెల్

వ్యాక్సినేషన్ విషయమంలో ‘నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్’ కీలక సూచన చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారు 9 నెలల తర్వాత టీకా వేసుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అయితే గతంలో 6 నెలల వ్యవధి ఉండాలని ఈ ప్యానెల్ సిఫార్సు చేసింది. కానీ… తాజాగా 9 నెలల వ్యవధి ఉండాలని సూచిస్తోంది. అయితే ఈ గ్రూప్ ఇచ్చిన సలహాపై మరో రెండు రోజుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇంతటి వ్యవధి ఉంటే శరీరంలో యాంటీబాడీలు మరింత వృద్ధి చెందుతాయని, కరోనా నుంచి కోలుకున్న వారు తొలి డోసు టీకా కోసం మరింత ఎక్కువ కాలం వేచి ఉంటేనే మంచిదని ప్యానెల్ అంటోంది. తొమ్మిది నెలల తర్వాత టీకా తీసుకుంటే అది శరీరంలో ఎక్కువ మొత్తంలో యాంటీబాడీలను వృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుందని ప్యానెల్ పేర్కొంది.