నాలుగు సింహాలకు కరోనా పాజిటివ్

మహమ్మారి జనంతో పాటు మూగజీవాలను వదలడం లేదు. బార్సిలోనా జంతు ప్రదర్శనశాలలో నాలుగు సింహాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్టు జూ అధికారులు తెలిపారు. జూపార్క్ లోకి నిత్యం సందర్శకులు వస్తుండడంతో అందులోని నాలుగు సింహాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటికి కొవిడ్ 19 పాజిటివ్‍గా తేలిందని పశు వైద్యాధికారులు తెలిపారు. జాలా, నిమా, రన్ రన్, కింబే అనే సింహాల్లో స్వల్ప లక్షణాలున్నట్లు కీపర్లు గుర్తించారు. జూపార్క్ లోని ఇద్దరు సిబ్బంది సైతం వైరస్ పాజిటివ్‍గా పరీక్షించారు. అయితే సింహాలకు వైరస్ ఎలా సోకి ఉంటుందని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. సింహాలకు సైతం మనుషులకు చేసినట్లు పీసీఆర్ పరీక్షలు చేశారు.
ఏప్రిల్ నెలలో న్యూయార్క్ లోని బ్రోంక్స్ జూపార్క్ లో మూడు పులులు, నాలుగు సింహాలకు కరోనా బారినపడి అవి కోలుకున్నాయి. అక్టోబర్‍లో యూఎస్ టేనస్సీలోని జూలో పిల్లలతో సహా పులికి వైరస్ సోకింది. కరోనా సోకిన సింహాలకు పశువైద్య సంరక్షణ శాఖ అధికారులు చికిత్స అందిస్తున్నారు.