ప్రపంచంలోనే తొలిసారిగా… ముక్కు టీకా
కరోనా నియంత్రణకు ప్రపంచంలోనే తొలిసారిగా ముక్కు టీకాను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ ఆ దిశగా మరో ముందడుగు వేసింది. నాజల్ వ్యాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్రం అనుమతి మంజూరు చేసినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) వెల్లడించింది. అడినోవైరల్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ (బీబీవీ 154) గా పిలిచే ఈ టీకా తొలి దశ ట్రయల్స్ 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయస్సు గల వారిపై విజయవంతంగా నిర్వహించినట్టు తెలిపింది. డీటీబీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఆర్ఆర్ఏసీ) సహకారంతో భారత్ బయోటెక్ ముక్కు టీకాను అభివృద్ధి చేస్తున్నది.







