ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకుడు ఎన్.వి.ఎల్.నాగరాజు ఇక లేరు
ఢిల్లీ తెలుగు అకాడమీ వ్యవస్థాపకుడు ఎన్.వి.ఎల్.నాగరాజు (70) మంగళవారం రాత్రి మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడటంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన నాగరాజు ఢిల్లీలోని ఇఫ్కోలో మార్కెటింగ్ మేనేజరుగా ఉద్యోగంలో చేరారు. 1989లో ఢిల్లీ తెలుగు అకాడమీని స్థాపించారు. దీని ద్వారా ఢిల్లీలో స్థిరపడిన తెలుగు కుటుంబాలకు చెందిన పిల్లలను సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాల వైపు ఆకర్షించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. వారం రోజుల క్రితమే ఆయన మాతృమూర్తి కూడా కరోనాతో చనిపోయారు.






