మిక్సింగ్ టీకాలతో మరింత రక్షణ

మిక్సింగ్ టీకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. కరోనా వైరస్ నుంచి సమర్థంగా రక్షణ కల్పిస్తున్నాయి. రెండు డోసుల అస్ట్రాజెనెకా (ఇండియాలో కొవిషీల్డ్) వ్యాక్సిన్ వేసుకొన్నవారితో పోల్చితే మొదటి డోసు అస్ట్రాజెనెకా, రెండో డోసు ఫైజర్ టీకా వేసుకొన్నవారికి వైరస్ నుంచి ఎక్కువ రక్షణ లభిస్తున్నదని స్వీడన్‌లో దేశవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో భాగంగా ఒకే రకమైన టీకా వేసుకొన్నవారిలో ఇమ్యూనిటీ, రెండు భిన్న రకాల వ్యాక్సిన్లు వేసుకొన్నవారిలో ఇమ్యూనిటీని రెండున్నర నెలల పాటు గమనించారు.