క్యాన్సర్ రోగులకు బూస్టర్ డోసు : ఫౌచీ
క్యాన్సర్ రోగులు, అవయవాల మార్పిడి చేసుకున్నవారు, ఇతరత్రా కారణాలతో రోగనిరోధక వ్వవస్థ బలహీనంగా ఉన్నవారికి కొవిడ్ -19 మూడో డోసు (బూస్టర్) ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అమెరికా అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ చెప్పారు. అయితే ఇందుకు ఫెడరల్ డ్రగ్ అడ్మినిస్ట్రేషణ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందన్నారు. అలాగే రెండు డోసులు తీసుకున్న వృద్ధుల్లో ఎంతవరకు, ఎంతకాలం వైరస్ నుంచి రక్షణ ఉంటోందో తెలుసుకొనే డేటా సేకరిస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడున్న ఏ టీకా కూడా కరోనా వైరస్ నుంచి నిరవధిక రోణ కల్పించలేదని, అందువల్ల ఏదోక సమయానికి అందరూ బూస్టర్లు తీసుకోవడం అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు.







