దేశంలో కాస్త తగ్గిన కేసులు… కొత్తగా

దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా ప్రతిరోజూ నాలుగు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు, రెండు రోజులుగా 4 వేల కంటే అధికంగా మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా ఈ పరంపరకు కాస్తా బ్రేక్ పడింది. ఆ సంఖ్య 3.6 లక్షలకు పడిపోయింది. అదేవిధంగా మరణాలు కూడా నాలుగు వేల దిగువకు పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,74,606 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 3,66,161 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 2,26,62,575కు చేరింది. గడిచిన 24 గంటల్లో 3,754 మంది కరోనా బాధితులు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 2,46,116 మంది మృతి చెందారు. 24 గంటల్లో కరోనా నుంచి ఆస్పత్రుల నుంచి కోలుకొని 3,53,818 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 1,86,71,22 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 37,45,237 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 17,01,76,603 మంది కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.