జోరు తగ్గని కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల నమోదులో వృద్ధి కనిపిస్తూనే ఉంది. అమెరికా, బ్రెజిల్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్లోరిడా, న్యూయార్క్, టెక్సాస్ రాష్ట్రాల్లో వ్యాధి తీవ్రత అత్యధికంగా ఉంది. కొద్ది రోజులుగా జపాన్‌లోనూ కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు, హాంకాంగ్, ఈజ్రాయిల్లోని ఇటీవల వైరస్ వ్యాప్తి తగ్గిందని భావిస్తుండగా ఇప్పుడు అక్కడ కరోనా విస్తరిస్తోంది. చైనాలో గత మూడు నెలల్లో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు అత్యధికంగా 101 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.






