తెలంగాణలో 1,764 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,764 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 58,906కు పెరిగింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ కరోనా సమాచారాన్ని విడుదల చేసింది. కరోనాతో నిన్న 12 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 492కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,97,939 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. రాష్ట్రంలో కరోనా నుంచి 43,751 మంది కోలుకోగా, మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 14,663కు చేరిందని అధికారులు వెల్లడించారు. కొత్తగా నిన్న 18,858 కరోనా పరీక్షలు నిర్వహించగా 1764 కేసులు నమోదయ్యాయి.






