తెలంగాణలో కొత్తగా 1,473 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 1,473 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 55,532కి చేరింది. మరోవైపు 8 మంది కొవిడ్‌తో మరణించగా మొత్తం మృతుల సంఖ్య 471కి పెరిగింది. కరోనా నుంచి తాజాగా 774 మంది కోలుకోగా ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 42,106కి చేరింది. ప్రస్తుతం 12,955 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.85 శాతమని అధికారులు తెలిపారు. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 506 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 168, వరంగల్ అర్బన్ 111 కేసులు బయటపడ్డాయి.






