ఏపీలో 5,487 మందికి పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రికవరీ శాతం భారీగా పెరుగుతోంది. సోమవారం నాటికి 89.89 శాతానికి చేరింది. ఈ రేటు 90 శాతం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 68,121 మందికీ పరీక్షలు చేయగా, 5,487 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 56,66,323 మందికి పరీక్షలు చేశారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,81,161 చేరింది. ఒక్క రోజులో 7,210 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,12,300కి చేరింది. తాజాగా 37 మంది మృతితో మొత్తం మరణాలు 5,745కి చేరాయి. యాక్టివ్ కేసులు 63,116 ఉన్నాయి. రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 1,06,111 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.






