ఆంధప్రదేశ్ లో తగ్గుతున్న కరోనా ఉదృతి….
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉదృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 68,429 శాంపిల్స్‌ను పరీక్షించగా 6,190 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా మరో 35 మంది ప్రాణాలు కోల్పోగా.. 9,836 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధికారులు బులిటెన్ విడుదల చేశారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 57,34,752 శాంపిల్స్ పరీక్షించగా, 6,87,351 మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 6,22,136 మంది కోలుకోగా 5,780 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 59,435 క్రియాశీల కేసులు ఉన్నాయి.
ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది మృత్యువాతపడగా, చిత్తూరు జిల్లాలో ఆరుగురు, అనంతపురం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, విశాఖలో ముగ్గురు, నెల్లూరు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరేసి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో 991 పాజిటివ్ కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 907 కేసులు వచ్చాయి.






