ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు…

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 42,911 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, 282 మందికి పాజిటివ్‍గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8,80,712కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‍ను విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా కడపలో ఒక్కరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7,092కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 442 మంది క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 8,69,920 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 1,15,74,117 శాంపిల్స్ ను పరీక్షించారు.