భారతీయ శాస్త్రవేత్తల ఘనత.. అన్ని వేరియంట్లకూ

కరోనా మహమ్మారి అన్ని వైవిధ్యాలకు సమర్థవంతమైన టీకా వస్తోంది. ఇకపై బూస్టర్లతో పనిలేకుండా శక్తివంతమైన యూని వర్సల్ వ్యాక్సిన్‌ను భారతీయ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు. సార్స్ కోవ్ 2 వైరస్ కొత్త వైవిధ్యాలతో తీవ్రమైన అంటువ్యాధిగా ప్రబలుతోంది. కొత్త వేరియంట్ వచ్చినప్పుడల్లా ప్రాణభయంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ ఆందోళనలకు చెక్ పెట్టేలా అన్ని వేరియంట్లకే ఒకే టీకాను భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. కాజీనజ్రుల్ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్‌సిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి శాస్త్రవేత్తలు పెప్టెడై వ్యాక్సిన్‌ను రూపొందించారు. భవిష్యత్‌లో ముందుకొచ్చే కొత్త తరంగాలను ఈ వ్యాక్సిన్ నిలువరిస్తుందని తెలిపారు. వారి పరిశోధన సాధారణ, పరమాణు, సంక్లిష్ట ద్రవాల నిర్మాణం ఆధారంగా సాగింది. అభిస్కోవాక్‌ను రూపొందించడానికి తాము ఇమ్యునో ఇన్ఫర్మేటిక్ విధానాలు ఉపయోగించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.