కోవిడ్ -19 తో మారుతున్న జీవనశైలి
అమెరికాలో మొదటి కరోనా వైరస్ కేసు నమోదు అయినప్పటి నుండి కొన్ని నెలలుగా కొనసాగుతున్న COVID-19 సంక్షోభం అమెరికన్స్ జీవితాలను మరియు జీవనోపాధిని మార్చివేసింది అనే చెప్పాలి. మెకిన్సే నిర్వహించిన అమెరికన్ ప్రజల సెంటిమెంట్ సర్వే నివేదిక ప్రకారం సాధారణ సమయాలతో పోలిస్తే COVID-19 సమయంలో అమెరికన్ ప్రజల రోజువారీ జీవితంలో దాదాపు ప్రతి దినచర్యను వేగంగా మార్చడానికి కారణమైంది అనే చప్పాలి. తప్పనిసరి లాక్డౌన్లు మరియు వ్యాపార మూసివేతల యొక్క పరిధి మరియు వ్యవధి ప్రజల్లో లోతుగా ఇమిడిపోయిన కొన్ని అలవాట్లను కూడా ప్రజలు వదులుకోవలసి వచ్చింది
ఉదాహరణకి కిరాణా షాపింగ్, వ్యాయామం , మధ్యాహ్నం విరామం కోసం కాఫీ షాప్‌కు వెళ్లడం లేదా శనివారం రాత్రి సినిమాల్లో ఆనందించడం వంటివి. ప్రజల్లో వచ్చిన ఈ ప్రవర్తన మార్పు యొక్క ప్రేరణ అస్థిరమైన అయినప్పటికీ, వినియోగదారు కంపెనీలు సంక్షోభానంతర కాలంలో వినియోగదారుల అవసరాలను తీర్చడానికి మార్గాలను కనుగొనడంలో బాగా పనిచేశారు అనే చెప్పాలి మరియు సంక్షోభానంతర కాలంలో వారి అవసరాలను తీర్చారు అని అనడంలో అతిశయోక్తి లేదు. సుమారు 54 శతం మంది ప్రజలు రాత్రి భోజనానికి రెస్టారెంట్లు ఎంచుకోవడం , లేదా మధ్యాహ్నం భోజనం కోసం ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కంటే ఇంటి వంటను ఇష్టపడుతున్నారు. క్యాండిల్ లైట్ డిన్నర్ అందుబాటులో కి వచ్చినప్పటికీ ప్రజలు జంట వంటను ఇష్టపడుతున్నారు అని చెప్పాలి మరియు 22 శాతం మంది ప్రజలు స్వయంగా తయారుచేసిన ఇంటి ఆహారాన్ని అలవాటు చేసుకోవడం యొక్క ఫలితాన్ని చూసిన తర్వాత ఇంటి ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతున్నారుట.
COVID-19 సంక్షోభం సమయంలో అమెరికా ప్రజలలో సుమారు 15 శాతం మంది మొదటిసారిగా కిరాణా సామానులను ఉపయోగించటానికి హోమ్ డెలివరీకి ప్రయత్నించారు. ఈ 15 శాతం మందిలో, 80 శాతం కంటే ఎక్కువ మంది స్వయం అనుభవం యొక్క సౌలభ్యం మరియు భద్రతతో సంతృప్తి చెందారని , మరియు 40 శాతం మంది సంక్షోభం తరువాత తమ కిరాణా సామాగ్రిని పొందడం కొనసాగించాలని భావిస్తున్నారు.ఈ పరిణామంతో ఇకామర్స్ 3 నెలలో 10 సంవత్సరాల లో చూసే ఎదుగుదలను చూసింది.
ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే వీకెండ్స్ లో మల్టీప్లెక్స్ కి వెళ్లి సినిమాలు చూసే వాళ్ళు, గేమ్స్ ఆడేవాళ్ళు , స్క్రీన్ చూసి ఆనందం పొందే వారికి ఆన్లైన్ ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం లో ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ బాగా పని చేసాయి అనే చెప్పాలి ఇందుకు గడిచిన 5 నెలలో నెట్‌ఫ్లిక్స్‌కు పెరిగింన 16 మిలియన్ సబ్స్క్రైబర్స్ , డిస్నీ కి సబ్‌స్క్రైబ్ అయినా 50 మిలియన్ సబ్స్క్రైబర్స్ అంతే కాక గేమ్స్ యాప్స్ డౌన్లోడింగ్ 30 శాతం పెరగడం కారణం. ఇంకా అతి ముఖ్యమైన ఆరోగ్య విషయానికి వస్తే లాక్ డౌన్ సమయం లో ప్రజలు అర్ధవంతమైన స్వయం సంరక్షణ సామర్థ్యం ముఖ్యమైనది గా భావించి టెలిమెడిసిన్ కోసం ఆన్లైన్లో వెతికిన వారి సంఖ్య 90 మిలియన్స్ కి పైగానే ఉంది.
COVID-19 కారణంగా నిరుద్యోగ సంఖ్య బాగా పెరిగినప్పటికీ జూమ్ టెక్నాలజీ ద్వారా రిమోట్ వర్కింగ్ చేసే అవకాశం ఉండడంతో చాలా ఉద్యోగాలు నిలబడ్డాయి అనే చెప్పాలి ఇందుకు 10 మిలియన్స్ ఉన్న జూమ్ టెక్నాలజీ వినియోగదారులు 3 నెలలలో 200 మిలియన్స్ కి చేరడమే కారణం గా చెప్పవచ్చు. ఇంకా రిమోట్ విద్య బోధన విషయం గురించి చెప్పనక్కర్లేదు ప్రభుత్వాలే ఆన్లైన్ విద్య బోధనకు వోట్ వేయడం తో రిమోట్ విద్య భోధన లో కొత్త విధానాలు కనుగొంటూ 120 శాతం ఎదుగుదలతో దూసుకు వెళుతుంది. ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు కూడా ఈ రంగం లో అడుగుపెట్టానికి ముందుకు వస్తుండటం విశేషం.
పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నది అనే చెప్పాలి.చాల మంది ప్రజలు ప్రజా రవాణా ఉపయోగించటానికి మొగ్గు చూపకపోవడం, తప్పని పరిస్థితుల్లో తప్ప ప్రయాణించటానికి ఇష్టపడకపోవడం తో ఎయిర్ ట్రావెల్ రంగం 90 శాతం కి పైగా పడిపోగా, ప్రయాణం సంబంధించిన రంగాలు మరింత దయనీయమైన పరిస్థితి లో ఉన్నాయి. ఇంకా మీడియా రంగం కి వస్తే ప్రింట్ మీడియా 33 శాతం పతనాన్ని చూడగా ఆన్లైన్ లో న్యూస్ పేపర్ చదివేవారి సంఖ్య 39 శాతం కి పెరగగా టీవీ న్యూస్ చానల్స్ చూసేవారి సంఖ్య 43 శాతం కు పెరిగినట్టు , సోషల్ మీడియా ని ఉపయోగించే వారి సంఖ్య 40 శాతం కు పైగా పెరిగారు అని మెకిన్సే నిర్వహించిన అమెరికన్స్ సెంటిమెంట్ సర్వే నివేదిక చెప్తుంది.






