రాష్ట్రాలకు ఉచితంగానే వ్యాక్సిన్లు : ప్రకటించిన కేంద్రం

కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉచితంగానే కరోనా వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఒక టీకా డోసును తాము 150 రూపాయలను కొనుగోలు చేస్తామని, రాష్ట్రాలకు మాత్రం ఉచితంగానే పంపిణీ చేస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా వ్యాక్సిన్ ధరల విషయంలో కేంద్రానికి ఒకలా, రాష్ట్రాలకు మరోలా ఉండడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కేంద్రానికి 150 రూపాయలకు మాత్రమే ఇస్తామని సీరమ్ ప్రకటించింది. అదే రాష్ట్రాలకు మాత్రం 400 రూపాయలకు ఇస్తామని సీరమ్ సీఈవో అధర్ పూనంవాలా ప్రకటించారు. ఇక ప్రభుత్వాసుపత్రులకు 600 రూపాయలకు ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.