మరో వారం రోజుల్లోగా స్పుత్నిక్-వీ : కేంద్రం ప్రకటన

కరోనా కష్ట కాలంలో కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకా త్వరలోనే మార్కెట్‌లోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యాక్సిన్ దేశానికి వచ్చేస్తోందని, మరో వారం రోజుల్లో మార్కెట్‌లో లభించనుందని ప్రకటించింది. ఒకటి రెండు రోజుల్లో స్పుత్నిక్ వీ టీకాకు దిగుమతి లైసెన్స్ మంజూరు అవుతుందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ ప్రకటించారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ వీ ఈ మూడు వ్యాక్సిన్లకు మాత్రమే దేశంలో విక్రయానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.
ఎగుమతి దరఖాస్తులు పెండింగ్‌లో లేవు : పాల్
విదేశీ టీకాల దిగుమతి కోసం ఎలాంటి దరఖాస్తులూ పెండింగ్‌లో లేవని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పష్టం చేశారు. విదేశీ టీకాల దిగుమతికి ఒకటి లేదా రెండు రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తామని తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్‌డీఏ ఆమోదించిన టీకాల దిగుమతికి మాత్రం అనుమతినిస్తామని పాల్ తెలిపారు.