ఫిబ్రవరి 28 వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా

కొవిడ్ ఎదుర్కొనేందుకు పాటిస్తున్న రక్షణ చర్యలను ఫిబ్రవరి నెలాఖరు వరకూ కొనసాగించాలని, ఏమాత్రం పట్టు సడలించవద్దని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గురువారం నాడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్ కేసులు క్రమేపి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను అప్రమత్తం చేయాలని కోరారు. ఫిబ్రవరి 28 వరకూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తప్పనిసరిగా కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు రక్షణాత్మక చర్యలను పట్టు సడలించకుండా కొనసాగించాలి. అన్ని మార్గదర్శకాలను ముందస్తు జాగ్రత్తలను తుచ తప్పకుండా పాటించాలని సూచించారు.