సీరమ్, భారత్ బయోటెక్లకు … కేంద్రం

కరోనా టీకా ధరలు తగ్గించాలని భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఆయా కంపెనీల ప్రతినిధులలో సంప్రదింపులు జరిపినట్టు కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా తెలిపారు. కరోనా వ్యాక్సిన్ డోసులు కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరు ధరలతో విక్రయించడంపై వివిధ రాష్ట్రాలు విమర్శలు గుప్పించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించింది. కొవాగ్జిన్ వ్యాక్సిన్ ఒక్క డోసు ధరను భారత్ బయోటెక్ సంస్థ కేంద్రానికి రూ.150గా, రాష్ట్రాలకు రూ.600, ప్రైవేట్ దవాఖానలకు రూ.1,200గా నిర్ణయించింది. కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్క డోసు ధరను సీరమ్ సంస్థ..కేంద్రానికి రూ.150 గా, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేట్ దవాఖానలకు రూ.600గా నిర్ణయించింది.