టెక్సాస్ బాటలో కాలిఫోర్నియా
అమెరికా లో కోవిడ్ -19 ప్రభావం తగ్గినట్లుగానే కనిపిస్తున్న మళ్ళి పంజా విసరబోతున్నదా అన్నట్టుగా ఉంది అమెరికా లోని రాష్ట్రాల పరిస్థితి. టెక్సాస్ తరువాత కోవిడ్ -19 వ్యాప్తి చెందటం ప్రారంభమైనప్పటి నుండి 1 మిలియన్ కరోనా వైరస్ కేసుల నమోదును అధిగమించిన రెండవ రాష్ట్రంగా కాలిఫోర్నియా రికార్డు సృటించింది. కరోనా వైరస్ కేసుల నమోదులో కాలిఫోర్నియా భయంకరమైన మైలురాయిని చేరుకుంది అని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ గణాంకాల ప్రకారం కాలిఫోర్నియా రాష్ట్రం లో గురువారం 12 నవంబర్ 2020 న 5 వేలకు పైగా కొత్త కోవిడ్ -19 కేసులు నమోదు కాగా కోవిడ్ -19 తో మరణించిన వారి సంఖ్య 18 గా నమోదు ఐయింది. కాలిఫోర్నియా రాష్ట్రవ్యాప్తంగా గురువారం 12 నవంబర్ 2020 నాటికి 1,000,631 కోవిడ్ -19 కేసులు, 18,126 కోవిడ్ -19 మరణాలు నమోదు అయినట్లు జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ ప్రకటించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా కాలిఫోర్నియా లో కూడా కోవిడ్ -19 వ్యాప్తి పెరుగుతుంది అని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు.
సోమవారం నవంబర్ 9 2020 వార్తా సమావేశంలో గవర్నర్ గావిన్ న్యూసోమ్ మాట్లాడుతూ కాలిఫోర్నియా రాష్ట్రంలో సోమవారం నవంబర్ 9 2020 న 7,200 కి పైగా కొత్త కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి మరియు 7 రోజుల సగటు 5,889 గా నమోదు అయ్యాయి అని ప్రకటించారు. అయితే ఒక రోజు తరువాత మంగళవారం 10 నవంబర్ 2020 న కాలిఫోర్నియా రాష్ట్ర ఆరోగ్య మరియు మానవ సేవల కార్యదర్శి డాక్టర్ మార్క్ ఘాలీ మాట్లాడుతూ 7 రోజులకి కాలిఫోర్నియా రాష్ట్రము లో నమోదు అయిన కొత్త కరోనా వైరస్ కేసులుల సగటు 6,078 వరకు ఉన్నట్లు గా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.






